మల్లన్నసాగర్‌ నీటితో నిండటంపై కేసీఆర్ సంతోషం

  • కరీంనగర్‌లో నేడు దళిత బంధుపై సమీక్ష
  • సమావేశం అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం
  • మార్గమధ్యంలో హెలికాప్టర్ నుంచి మల్లన్నసాగర్ వీక్షణం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన దళిత బంధు పథకంపై సీఎం కేసీఆర్.. కరీంనగర్‌ జిల్లా కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం హెలికాప్టర్లో హైదరాబాద్ బయలుదేరారు. మార్గమధ్యంలో మల్లన్నసాగర్‌ జలాశయాన్ని హెలికాప్టర్ నుంచి వీక్షించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన జలాశయాల్లో మల్లన్నసాగర్‌ అతిపెద్దది. 50 టీఎంసీల సామర్థ్యంతో దీన్ని నిర్మించారు. ఈ నిర్మాణ పనులన్నీ ఇటీవలే పూర్తయ్యాయి. దీంతో ఈ ఏడాదే దీన్ని కాళేశ్వరం జలాలతో నింపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం నుంచి ప్రయోగాత్మకంగా నీటిని ఈ జలాశయంలోకి విడుదల చేస్తున్నారు. ఈ దృశ్యాలనే తన హెలికాప్టర్ నుంచి సీఎం కేసీఆర్ పరిశీలించారు. మల్లన్నసాగర్ జలాశయం నీటితో నిండటాన్ని చూసి సంతోషం వ్యక్తంచేశారు.


More Telugu News