' కొండపొలం' నుంచి వీడియో సాంగ్!

  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ
  • ఆహ్లాదకరమైన సంగీతం 
  • ఆకట్టుకునే ఆలాపన 
  • అక్టోబర్ 8వ తేదీన సినిమా విడుదల  
క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా 'కొండ పొలం' సినిమా రూపొందింది. సాయిబాబు - రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా, గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. వైష్ణవ్ తేజ్ జోడీగా రకుల్ నటించింది. దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 8వ తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక వీడియో సాంగును విడుదల చేశారు. 'ఓ ఓబులమ్మా ... ' అంటూ ఈ పాట సాగుతోంది.

ఈ పాటలో హీరో పశువుల కాపరిగా కనిపిస్తుంటే, పల్లె యువతిగా రకుల్ ఆకట్టుకుంటోంది. కీరవాణి స్వరపరిచిన ఈ మెలోడీ గీతం ఒక్కసారి వినగానే మనసుకు పడుతోంది. నాయకా నాయికలు ఒకరిని గురించి ఊహలలో ఒకరు .. ఒకరి జ్ఞాపకాలలో ఒకరు ఒదిగిపోతూ పాడుకునే పాట ఇది. సున్నితమైన భావాల ఆవిష్కరణతో కూడిన సాహిత్యం .. ఆలాపన .. చిత్రీకరణ ఈ పాటను మరోస్థాయికి తీసుకువెళుతున్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి పాటల్లో ఇది ఒకటి అని చెప్పుకోవచ్చు. 


More Telugu News