వెలిగొండ ప్రాజెక్టుకు నిధుల అంశంపై కేంద్రానికి తెలంగాణ లేఖ
- ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ అభ్యంతరాలు
- కేంద్రానికి లేఖ రాసిన తెలంగాణ ఈఎన్సీ
- వెలిగొండకు నిధులు ఎలా విడుదల చేస్తారన్న ఈఎన్సీ
- అనుమతుల్లేని ప్రాజెక్టు అని వ్యాఖ్య
ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం మరోసారి అభ్యంతరాలు వ్యక్తం చేసింది. వెలిగొండ ప్రాజెక్టుకు నిధుల అంశంపై కేంద్రానికి తాజాగా లేఖ రాసింది. వరద జలాల ఆధారంగా వెలిగొండ ప్రాజెక్టు చేపట్టారని ఆ లేఖలో తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ ఆరోపించారు.
వాస్తవానికి ఈ ప్రాజెక్టుకు కృష్ణా నది మొదటి ట్రైబ్యునల్ లో ఎలాంటి కేటాయింపులు లేవని స్పష్టం చేశారు. ఇటీవల విడుదలైన గెజిట్ నోటిఫికేషన్ లోనూ వెలిగొండను అనుమతుల్లేని ప్రాజెక్టుగా పేర్కొన్నారని, మరి ఈ ప్రాజెక్టుకు నిధులు ఎలా మంజూరు చేస్తారని తెలంగాణ ఈఎన్సీ ప్రశ్నించారు. వెలిగొండపై తాము గతంలోనే ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ఏఐబీపీ కింద కేంద్రం నిధులు ఇవ్వడం సమంజసం కాదని స్పష్టం చేశారు.