గన్నవరం ఎయిర్ పోర్టులో తొలిసారిగా ల్యాండైన 'ఎయిరిండియా వన్'

  • రాష్ట్రపతి తదితరుల కోసం 'ఎయిరిండియా వన్'
  • బోయింగ్-777 విమానంలో సకల హంగులు
  • దేశంలోని పలు విమానాశ్రయాల్లో ట్రయల్ ల్యాండింగ్
  • విజయవాడ వచ్చిన ఎయిరిండియా వన్
  • ల్యాండింగ్, టేకాఫ్ విజయవంతం
అమెరికా తరహాలో భారత్ లోనూ రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి ప్రయాణాల కోసం 'ఎయిరిండియా వన్' విమానం తీసుకురావడం తెలిసిందే. కేంద్రంలోని పెద్దల ప్రయాణాల కోసం ఈ మేరకు బోయింగ్-777 భారీ విమానాన్ని ఎంచుకున్నారు. అన్ని రకాల సదుపాయాలు, రక్షణ ఏర్పాట్లు ఈ విమానంలో ఉంటాయి.

అయితే ఇది భారీ విమానం కావడంతో, ఎలాంటి ఇబ్బందులు లేకుండా దిగేందుకు వీలున్న విమానాశ్రయాలను గుర్తిస్తున్నారు. ఈ క్రమంలో బోయింగ్-777 విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టుకు వచ్చింది. ఇక్కడి రన్ వేపై విజయవంతంగా ల్యాండైంది. అనంతరం ఎలాంటి అవాంతరాలు లేకుండా సులువగా టేకాఫ్ తీసుకుంది. గతంలో గన్నవరం ఎయిర్ పోర్టు రన్ వే 7,500 అడుగుల విస్తీర్ణంలో ఉండగా, ఇటీవల దాన్ని 11,023 అడుగులకు పెంచారు.


More Telugu News