నేడు సీజేఐ ఎన్వీ రమణ పుట్టినరోజు... శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
- అమూల్యమైన తీర్పులిచ్చారన్న సీఎం కేసీఆర్
- తనదైన ఒరవడిని పరిచయం చేశారని కితాబు
- భావితరాలకు ఆదర్శనీయమని వ్యాఖ్య
- మరింతకాలం సేవలు అందించాలని ఆకాంక్ష
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా సీజేఐ ఎన్వీ రమణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జస్టిస్ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన కొద్దికాలంలోనే అమూల్యమైన తీర్పులనిచ్చి తనదైన ఒరవడిని పరిచయం చేశారని కొనియాడారు.
వృత్తి పట్ల ఆయనకు ఉన్న అంకితభావం, ఆయన హుందాతనం రేపటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. జస్టిస్ రమణ మరింతకాలం దేశానికి సేవలు అందించాలని మనస్ఫూర్తిగా భగవంతుడ్ని కోరుకుంటున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. అటు, వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.