ఆర్బీఐ ఈడీగా అజయ్ కుమార్ నియామకం

  • ఆగస్టు 20 నుంచే అమల్లోకి
  • మూడు దశాబ్దాలుగా కేంద్రీయ బ్యాంకుతో అనుబంధం
  • పలు కీలక విభాగాల్లో పనిచేసిన అనుభవం
భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అజయ్ కుమార్‌ను నియమించారు. ఆయన నియామకం ఆగస్టు 20 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఆర్బీఐ ప్రకటించింది. అంతకు ముందు ఆయన ఢిల్లీలోని రీజనల్‌ డైరెక్టరేట్‌లో రీజనల్‌ డైరెక్టర్‌గా సేవలందించారు.

కరెన్సీ మేనేజ్‌మెంట్, ఫారెన్ ఎక్స్‌ఛేంజ్ విభాగం, ప్రిమైసెస్‌ విభాగాల బాధ్యతలు కూడా అజయ్ కుమార్ నిర్వర్తించనున్నారు. మూడు దశాబ్దాలుగా ఈ కేంద్రీయ బ్యాంకులో సేవ చేస్తున్న అజయ్ కుమార్.. ఫారెన్ ఎక్స్‌ఛేంజ్, బ్యాంకింగ్ పర్యవేక్షణ, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, కరెన్సీ నిర్వహణ తదితర విభాగాల్లో పనిచేశారు.

బీహార్‌లోని పాట్నా విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్‌లో ఆయన మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఐసీఎఫ్ఏఐ నుంచి ఎంఎస్‌, హైదరాబాద్‌లోని బ్యాంకింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ నుంచి బ్యాంక్ మేనేజర్‌గా సర్టిఫికెట్ కోర్సులు ఆయన పూర్తిచేశారు. అలాగే షికాగోలోని కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఎగ్జిక్యూటివ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. అంతేకాక సర్టిఫైడ్ అసోసియేట్ ఆఫ్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ వంటి అదనపు అర్హతలు కూడా అజయ్ కుమార్‌కు ఉన్నాయి.


More Telugu News