మరో వికెట్ తీసిన భారత్... సెంచరీ దాటిన ఇంగ్లండ్ ఆధిక్యం

  • హెడింగ్లే టెస్టులో భారీ స్కోరు దిశగా ఇంగ్లండ్
  • లంచ్ వేళకు తొలి ఇన్నింగ్స్ లో 182/2
  • ఫిఫ్టీలు సాధించి అవుటైన ఇంగ్లండ్ ఓపెనర్లు
  • ఇంగ్లండ్ కు 104 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం
టీమిండియాతో మూడో టెస్టులో ఇంగ్లండ్ కు శుభారంభం లభించింది. ఓపెనర్లు హసీబ్ హమీద్ (68), రోరీ బర్న్స్ (61) తొలి వికెట్ కు 135 పరుగులు జోడించారు. బర్న్స్ ను షమీ అవుట్ చేయగా, హమీద్ ను జడేజా పెవిలియన్ చేర్చాడు. లంచ్ సమయానికి ఇంగ్లండ్ స్కోరు 2 వికెట్లకు 182 పరుగులు. అప్పటికి ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 104 పరుగులు. క్రీజులో కెప్టెన్ జో రూట్ (14 బ్యాటింగ్), డేవిడ్ మలాన్ (27 బ్యాటింగ్) ఉన్నారు.

టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 78 పరుగులకే ఆలౌటైన నేపథ్యంలో, ఇంగ్లండ్ మరో రెండొందల పైచిలుకు పరుగులు చేస్తే టీమిండియా ముందర కష్టసాధ్యమైన లక్ష్యం నిలిచే అవకాశం ఉంది.


More Telugu News