కేంద్ర మంత్రి నారాయణ రాణేకు మహారాష్ట్ర పోలీసుల నోటీసులు

  • థాకరేపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రాణే
  • అరెస్టై, బెయిల్ మీద ఉన్న రాణే
  • సెప్టెంబర్ 2న విచారణకు హాజరు కావాలని పోలీసుల నోటీసులు
సెప్టెంబర్ 2న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ కేంద్ర మంత్రి నారాయణ రాణేకు నాసిక్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రసంగిస్తూ... స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేళవుతోందని వెనుక ఉన్న వ్యక్తులను అడిగారు.

ఈ నేపథ్యంలో నారాయణ్ రాణే మాట్లాడుతూ, స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందో కూడా ముఖ్యమంత్రికి తెలియదని... తాను అక్కడుంటే థాకరే చెంప ఛెళ్లుమనిపించేవాడినని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రాణేపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఆయనను అరెస్ట్ చేశారు. అయితే మహారాష్ట్రలోని ఓ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో తాజాగా విచారణకు హాజరు కావాలని రాణేకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.


More Telugu News