ప్రతి లవర్ సూరిబాబు పాత్రలో తనని తాను చూసుకుంటాడు: సుధీర్ బాబు
- ఇది ఒక పల్లెటూరి ప్రేమకథ
- సూరిబాబు పాత్రలో కనిపిస్తాను
- అందరికీ కనెక్ట్ అవుతుంది
- నా కెరియర్లో చెప్పుకోదగినది అవుతుంది
సుధీర్ బాబు కథానాయకుడిగా 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమా నిర్మితమైంది. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా గ్యాప్ తరువాత 'జాంబిరెడ్డి' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఆనంది, ఈ సినిమాలో శ్రీదేవి అనే ఓ పల్లెటూరి అమ్మాయి పాత్రను పోషించింది.
ఈ సినిమాను గురించి సుధీర్ బాబు మాట్లాడుతూ, "ఇది ఒక అందమైన ప్రేమకథ .. పల్లెటూళ్లలోని మనుషులు, వాళ్ల ఎమోషన్స్ ను చాలా సహజంగా ఆవిష్కరించిన సినిమా ఇది. ప్రతి లవర్ కూడా ఈ సినిమాలోని సూరిబాబు పాత్రలో తనని తాను చూసుకుంటాడు. ఆ పాత్ర అంతగా కనెక్ట్ అవుతుంది.
ఈ సినిమా చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి అంతా నా సిక్స్ ప్యాక్ గురించే మాట్లాడుతున్నారు. ఈ సినిమా విడుదలైన తరువాత కచ్చితంగా నా యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటారని అనుకుంటున్నాను. ఈ సినిమా నా కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలుస్తుందని భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.