హెడింగ్లే టెస్టు: ఎట్టకేలకు ఇంగ్లండ్ ఓపెనింగ్ జోడీని విడదీసిన షమీ
- తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
- 61 పరుగులు చేసిన బర్న్స్
- షమీ బౌలింగ్ లో అవుట్
- 80 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లండ్
- తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 78 ఆలౌట్
హెడింగ్లే టెస్టులో భారత్ ను స్వల్ప స్కోరుకు కుప్పకూల్చిన ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరుపై కన్నేసింది. కొరకరాని కొయ్యల్లా మారిన ఇంగ్లండ్ ఓపెనర్లను ఎట్టకేలకు మహ్మద్ షమీ విడదీశాడు. 61 పరుగులు చేసిన రోరీ బర్న్స్ షమీ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. దాంతో 135 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 1 వికెట్ నష్టానికి 158 పరుగులు కాగా... క్రీజులో మరో ఓపెనర్ హసీబ్ హమీద్ 68 పరుగులతోనూ, వన్ డౌన్ బ్యాట్స్ మన్ డేవిడ్ మలాన్ 17 పరుగులతోనూ ఆడుతున్నారు. ఇంగ్లండ్ ఆధిక్యం 80 పరుగులకు చేరింది.
ఆటకు నేడు రెండో రోజు కాగా, ఉదయం సెషన్ పేసర్లకు అనుకూలిస్తుందని భావించినా, ఆరంభంలో ఇంగ్లండ్ ఓపెనర్లు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. టీమిండియా బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ స్కోరుబోర్డును ముందుకు కదిలించారు. అంతకుముందు, తొలిరోజు ఆటలో టీమిండియా దారుణంగా ఆడి 78 పరుగులకే ఆలౌట్ కావడం తెలిసిందే.