ఏపీలో నకిలీ చలాన్ల అంశం.. జరిగిన తప్పులకు విచారిస్తున్నామన్న డిప్యూటీ సీఎం ధర్మాన

  • ఏపీలో కలకలం రేపిన నకిలీ చలాన్ల అంశం
  • పొరపాట్లు ప్రభుత్వం దృష్టికి రావడంలో ఆలస్యం జరిగిందన్న ధర్మాన
  • ఇప్పటికే పలువురిపై చర్యలు తీసుకున్నామని వ్యాఖ్య
నకిలీ చలాన్ల అంశం ఏపీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం దీనితో సంబంధం ఉన్న పలువురు అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంది. మరోవైపు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ నకిలీ చలాన్ల విషయంలో జరిగిన తప్పిదాలపై విచారిస్తున్నామని చెప్పారు.

జరిగిన పొరపాట్లు ప్రభుత్వం దృష్టికి రావడంలో ఆలస్యమయిందని అన్నారు. ఇప్పటికే పలువురిపై చర్యలు తీసుకున్నామని, కొంత నగదును రికవరీ కూడా చేశామని చెప్పారు. రికవరీ కావాల్సిన మొత్తాన్ని పూర్తి స్థాయిలో రాబడతామని తెలిపారు. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి తప్పులు జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు. తప్పు చేసిన అధికారులు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని డిప్యూటీ సీఎం అన్నారు. 


More Telugu News