తాలిబ‌న్లు తీవ్రంగా కొట్టారు: టోలో న్యూస్ జ‌ర్న‌లిస్టు

  • జ‌ర్న‌లిస్టు చ‌నిపోయాడ‌ని వ‌దంతులు
  • దానిపై స్ప‌దించిన టోలో న్యూస్ ఛానెల్ రిపోర్ట‌ర్
  • తాను చ‌నిపోలేద‌ని ప్ర‌క‌ట‌న‌
ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న నేప‌థ్యంలో ఆ దేశంలో అక్ర‌మాలు పెరిగిపోతోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాలిబన్లు టోలో న్యూస్ జర్నలిస్టును హత్య చేశారని, ఈ మేర‌కు మీడియాకు సమాచారం అందిందంటూ వ‌దంతులు వ్యాపిస్తున్నాయి.

కాబూల్ విమానాశ్రయం ఎదుట ఈ హత్య జ‌రిగింద‌ని అస‌త్య‌ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ వ‌దంతుల‌పై స‌దరు జ‌ర్న‌లిస్ట్ స్పందించారు. త‌న‌ను తాలిబ‌న్లు తీవ్రంగా కొట్టార‌ని ఆయ‌న చెప్పారు. అంతేగానీ, తాను చ‌నిపోలేద‌ని వ్యాఖ్యానించారు. ప్రజాస‌మ‌స్య‌ల‌ను జ‌ర్న‌లిస్టు వివ‌రిస్తోన్న స‌మ‌యంలో ఆయ‌న‌ను తాలిబ‌న్లు కొట్టిన‌ట్లు తెలుస్తోంది. తాలిబ‌న్ల దాడిలో మ‌రికొంద‌రు జ‌ర్న‌లిస్టులూ గాయ‌ప‌డిన‌ట్లు స‌మాచారం.


More Telugu News