కాబుల్ ఎయిర్‌పోర్టు వద్ద దారుణ పరిస్థితులు.. ప్లేటు భోజనం రూ. 7,500

  • కాబూల్ ఎయిర్ పోర్టులో వేలాది మంది ప్రజలు
  • ఆహారం దొరక్క సొమ్మసిల్లుతున్న జనాలు
  • ఒక లీటర్ మంచినీళ్ల బాటిల్ ధర రూ.3 వేలు    
ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశమైన తర్వాత అక్కడి పరిస్థితులు దిగజారాయి. ఆ దేశం నుంచి బయటపడేందుకు వివిధ దేశస్తులతో పాటు ఆఫ్ఘన్ ప్రజలు కూడా అక్కడి నుంచి బయటపడేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ క్రమంలో కాబూల్ ఎయిర్ పోర్టుకు వేల మంది చేరుకున్నారు. ఏదో ఒక విమానంలో దేశం దాటేందుకు వారు యత్నిస్తున్నారు.

మరోవైపు ఎయిర్ పోర్టు వద్ద తాగునీటి కోసం, ఆహారం కోసం వారంతా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆహారం అందక ఎంతోమంది సొమ్మసిల్లి పడిపోతున్నారు. ఇదే అదనుగా భావించి, ఎయిర్ పోర్ట్ వెలుపల తాగునీరు, ఆహారాన్ని ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. ఒక లీటర్ వాటర్ బాటిల్ ను 40 డాలర్లకు (దాదాపు రూ. 3 వేలు), ఒక ప్లేట్ భోజనాన్ని 100 డాలర్లకు (దాదాపు రూ. 7,500) విక్రయిస్తున్నారు. మరోవైపు వీటిని ఆఫ్ఘన్ కరెన్సీకి కాకుండా అమెరికా డాలర్లకు అమ్ముతుండటంతో ఆఫ్ఘనిస్థాన్ పౌరులు ఇక్కట్లు పడుతున్నారు.


More Telugu News