మరికాసేపట్లో వివాహం.. పెళ్లి పందిరి నుంచి వధువు పరారీ
- నిన్న ఉదయం పెళ్లికి ఏర్పాట్లు
- నలుగు కార్యక్రమం అనంతరం వధువు పరారీ
- తనకు అవమానం జరిగిందంటూ పెళ్లి కొడుకు ఫిర్యాదు
- వధువు మైనర్ అని తేల్చిన పోలీసులు
మరికాసేపట్లో పెళ్లి పెట్టుకుని వధువు పరారైన సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా ఎన్‌పీకుంట మండలం బలిజపల్లెకు చెందిన యువకుడు (26)కి తంబళ్లపల్లె మండలం కొటాల పంచాయతీ పరిధిలోని గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. నిన్న వివాహం జరగాల్సి ఉండడంతో మదనపల్లె చేరుకున్న వధూవరుల కుటుంబ సభ్యులు అమ్మచెరువు సమీపంలోని కల్యాణ మండపంలో వివాహానికి ఏర్పాట్లు చేశారు.
ఇక మంగళవారం రాత్రి వధూవరులకు నలుగుపెట్టారు. ఈ తంతు పూర్తయిన తర్వాత రాత్రికి రాత్రే కుటుంబ సభ్యుల కళ్లుగప్పి వధువు పరారైంది. విషయం తెలిసిన ఇరు కుటుంబాల సభ్యులు షాక్‌కు గురయ్యారు. మరోవైపు, తనకు అవమానం జరిగిందంటూ వరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించగా, వధువు మైనర్ అని తేలింది. దీంతో దర్యాప్తు చేపట్టారు.