తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి వర్షాలు

  • తెలంగాణలో సాధారణంగా రుతుపవనాల కదలికలు
  • నిజామాబాద్ జిల్లా కోటగిరిలో కుండపోత వాన
  • నాగులవంచలో అత్యధిక పగటి ఉష్ణోగ్రత నమోదు
తెలంగాణలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయని, వీటి ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మరోవైపు పశ్చిమ, వాయవ్య భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణలోకి గాలులు వీస్తున్నట్టు పేర్కొంది. రాష్ట్రంలో నిన్న పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.

నిజామాబాద్ జిల్లా కోటగిరిలో కుంభవృష్టి కురిసింది. ఇక్కడ అత్యధికంగా 13.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో అప్పటికప్పుడు మేఘాలేర్పడి భారీ వర్షాలు కురవడం గమనార్హం. కొన్ని ప్రాంతాల్లో మాత్రం భానుడు తన ప్రతాపం చూపించాడు. ఖమ్మం జిల్లా నాగులవంచలో అత్యధికంగా 38 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది.


More Telugu News