ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు: సీఎం జగన్ ఆవేదన

  • కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం సమీక్ష
  • ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఘటనల ప్రస్తావన
  • చేయగలిగినంత చేశామని వెల్లడి
  • స్వార్థ రాజకీయ ప్రయోజనాలు అంటూ వ్యాఖ్యలు
సీఎం జగన్ ఇవాళ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన కొన్ని ఘటనలను సీఎం జగన్ ఈ సమావేశంలో ప్రస్తావించారు. కొన్నిరోజుల కిందట రాష్ట్రంలో కొన్ని దురదృష్టకర సంఘటనలు జరిగాయని, ఈ ఘటనలు జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిన తీరు, చర్యలు తీసుకున్న వైనం అందరికీ తెలుసని స్పష్టం చేశారు.

తనతో సహా కలెక్టర్లు, ఎస్పీలు చేయగలిగినంత చేస్తున్నామని, అయినప్పటికీ ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఆడపిల్లలు, వారి కుటుంబ గౌరవాలను బజారుకీడుస్తున్నారని విమర్శించారు. స్వప్రయోజనాల కోసం ఓ వర్గం మీడియా కూడా తప్పుడు ప్రచారం చేస్తోందని, తాము దానితో కూడా పోరాడుతున్నామని వెల్లడించారు.


More Telugu News