వచ్చే ఏడాది బర్మింగ్ హామ్ వేదికగా కామన్వెల్త్ క్రీడలు
- 2022లో ఇంగ్లండ్ లో కామన్వెల్త్ క్రీడలు
- జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు క్రీడోత్సవం
- హైదరాబాదులో కౌంట్ డౌన్ కార్యక్రమం
- హాజరైన భారత క్రీడాకారులు
కరోనా సంక్షోభ సమయంలోనూ క్రీడలు ప్రపంచవ్యాప్త అభిమానులను అలరిస్తున్నాయి. ఇటీవలే టోక్యో ఒలింపిక్స్ విజయవంతం కాగా, ప్రస్తుతం అక్కడే పారాలింపిక్ పోటీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వచ్చే ఏడాది ఇంగ్లండ్ లోని బర్మింగ్ హామ్ లో 22వ కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి. 2022 జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు ఈ పోటీలు జరగనున్నాయి.
ఈ మెగా క్రీడోత్సవానికి మరో ఏడాది సమయం ఉండడంతో కౌంట్ డౌన్ షురూ చేశారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ భారత క్రీడాకారులతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భారత బ్యాడ్మింటన్ తారలు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్, కిదాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, ఇతర అథ్లెట్లు పాల్గొన్నారు.