సజ్జనార్ బదిలీ.. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా స్టీఫెన్ రవీంద్ర
- ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బదిలీ
- మూడేళ్ల పాటు సైబరాబాద్ కమిషనర్ గా బాధ్యతలను నిర్వహించిన సజ్జనార్
- సమర్థవంతమైన పోలీసు అధికారిగా సజ్జనార్ కు గుర్తింపు
సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ ను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. ఈయన స్థానంలో స్టీఫెన్ రవీంద్రను నియమించింది. సజ్జనార్ ను ఆర్టీసీ ఎండీగా బదిలీ చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సైబరాబాద్ కమిషనర్ గా సజ్జనార్ మూడేళ్ల పాటు విధులు నిర్వహించారు. తన పదవీ కాలంలో ఆయన సమర్థవంతమైన పోలీస్ అధికారిగా పేరు తెచ్చుకున్నారు.
దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిశ హత్యాచార నిందితుల ఎన్ కౌంటర్ ఆయన హయాంలోనే చోటుచేసుకుంది. మరోవైపు స్టీఫెన్ రవీంద్ర ప్రస్తుతం హైదరాబాద్ వెస్ట్ జోన్ ఐజీపీగా ఉన్నారు.
దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిశ హత్యాచార నిందితుల ఎన్ కౌంటర్ ఆయన హయాంలోనే చోటుచేసుకుంది. మరోవైపు స్టీఫెన్ రవీంద్ర ప్రస్తుతం హైదరాబాద్ వెస్ట్ జోన్ ఐజీపీగా ఉన్నారు.