70:30 నిష్పత్తితో నీటి పంపకాలు జరగాలి: కేఆర్ఎంబీకి ఏపీ లేఖ
- 50:50 నిష్పత్తితో పంచాలన్న తెలంగాణ ప్రభుత్వం
- అభిప్రాయం తెలపాలని ఏపీని కోరిన కేఆర్ఎంబీ
- రెండో ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు నీటి పంపకాలు జరపాలన్న ఏపీ
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం నెలకొన్న విషయం తెలిసిందే. కృష్ణా జలాలను 50:50 నిష్పత్తితో పంచాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో అభిప్రాయం తెలపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కేఆర్ఎంబీ కోరడంతో ఈ మేరకు ఏపీ లేఖ రాసింది.
2020-2021కి 70:30 నిష్పత్తితో నీటి పంపకాలు జరగాలని ఏపీ కోరింది. రెండో ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు నీటి పంపకాలు జరపాలని చెప్పింది. ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి పంపకాలు ప్రాజెక్టు వారీగా చేయలేదని ఏపీ తెలిపింది. శ్రీశైలం నుంచి చెన్నైకు, సాగర్ నుంచి హైదరాబాద్ కు మాత్రం తాగునీటి సరఫరాకు కొన్ని నిబంధనలు ఉన్నాయని చెప్పింది.