'శ్రీదేవి సోడా సెంటర్' షూటింగ్ మొదలెట్టాక అలా జరిగిందట!
- మొదటి రోజునే కెమెరా పడిపోయింది
- షూటింగులో కరెంట్ షాక్ కొట్టింది
- కారవాన్ గోతిలో దిగబడిపోయింది
- షూటింగు ఆపేయమన్నారు
- మొండిగా ముందుకు వెళ్లాము
సుధీర్ బాబు - ఆనంది జంటగా 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమా రూపొందింది. విజయ్ చిల్లా - దేవిరెడ్డి శశి నిర్మించిన ఈ సినిమా, గ్రామీణ నేపథ్యంలో నడుస్తుంది. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ఈ నెల 27వ తేదీన విడుదల చేయనున్నారు. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ వేగాన్ని పుంజుకున్నాయి.
నిర్మాతలు మాట్లాడుతూ .. "ఈ సినిమా షూటింగు మొదలు పెట్టగానే చాలా ఖరీదైన ఆ కెమెరా కిందపడిపోయింది. అంతా కూడా అదో అపశకునంగా భావించారు. ఆ తరువాత ఒక అసిస్టెంట్ కి కరెంట్ షాక్ తగిలింది. దాంతో అందరికీ కూడా అదోలా అనిపించింది. ఆ మరుసటి రోజు కారవాన్ ఒక గోతిలో దిగబడిపోయి చాలా ఇబ్బంది పెట్టింది.
ఇలా వరుసగా కొన్ని సంఘటనలు జరుగుతూ రావడంతో, షూటింగును ఆపేయడమే మంచిదని కొంతమంది సలహా ఇచ్చారు. అయినా మేము పట్టించుకోకుండా ముందుకు వెళ్లాము. ఇన్ని అపశకునాలు ఎదురైనప్పటికీ, బిజినెస్ మాత్రం చాలా వేగంగా జరిగిపోయింది. శ్రమను నమ్ముకుని ముందుకు వెళ్లాము. ఇక విజయం కోసమే ఎదురుచూస్తున్నాము" అని చెప్పుకొచ్చారు.