లేపాక్షి నాలెడ్జ్ హబ్ చార్జిషీటు నుంచి తనను తొలగించాలంటూ సీఎం జగన్ డిశ్చార్జి పిటిషన్

  • అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టులో విచారణ
  • లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసులో తన పాత్ర లేదన్న జగన్
  • విచారణ వచ్చే నెల 3కి వాయిదా
  • డిశ్చార్జి పిటిషన్లు వేసిన విజయసాయి, ఆచార్య
అక్రమాస్తుల కేసులో సీబీఐ న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ చార్జిషీటు నుంచి తన పేరు తొలగించాలంటూ సీఎం జగన్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో తన పాత్ర ఏమీలేదని ఆయన విన్నవించారు. ఈ మేరకు డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేశారు.

అయితే, ఈ కేసులో మరికొందరు డిశ్చార్జి పిటిషన్లు దాఖలు చేసేందుకు వీలుగా విచారణను సెప్టెంబరు 3కి వాయిదా వేస్తున్నట్టు సీబీఐ కోర్టు పేర్కొంది. ఇప్పటివరకు డిశ్చార్జి పిటిషన్లు వేయని వారు ఎవరైనా ఉంటే ఈ ఆఖరి అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది. ఈ కేసులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య డిశ్చార్జి పిటిషన్లు దాఖలు చేశారు.


More Telugu News