కరణం రాహుల్ హత్యకేసులో కోగంటి సత్యంకు రిమాండ్

  • ఈ నెల 19న రాహుల్ హత్య
  • కారులో శవమై కనిపించిన వ్యాపారి
  • బెంగళూరు పారిపోయిన కోగంటి సత్యం
  • నిన్న అరెస్ట్ చేసిన పోలీసులు
విజయవాడలో వ్యాపారవేత్త కరణం రాహుల్ ఇటీవల హత్యకు గురికావడం సంచలనం రేపింది. ఈ కేసులో నిందితుడైన కోగంటి సత్యంను పోలీసులు నిన్న అరెస్ట్ చేయడం తెలిసిందే. కోగంటి సత్యంను ఇవాళ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. సత్యంకు విజయవాడ ఒకటవ అదనపు మేజిస్ట్రేట్ కోర్టు రెండు వారాల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు మచిలీపట్నం జైలుకు తరలించారు.

ఈ నెల 19న రాహుల్ ఓ కారులో శవమై కనిపించాడు. అతడు హత్యకు గురైనట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అప్పటినుంచి కోగంటి సత్యం పరారీలో ఉన్నాడు. అతడిని నిన్న బెంగళూరులో అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కోరాడ విజయ్ కుమార్ ఇప్పటికే పోలీసులకు లొంగిపోయాడు. విచారణలో కోరాడ అందించిన సమాచారం మేరకు, ఈ హత్యలో కోగంటి సత్యం పాత్రపై పోలీసులు ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది.


More Telugu News