సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు

  • ఇటీవల గుంటూరులో రమ్య హత్య
  • స్పందించిన జాతీయ ఎస్సీ కమిషన్
  • వైస్ చైర్మన్ అరుణ్ హల్దార్ నేతృత్వంలో గుంటూరుకు బృందం
  • ఏపీ ప్రభుత్వ స్పందన పట్ల సంతృప్తి 
ఇటీవల గుంటూరులో దళిత విద్యార్థిని రమ్య హత్య జరగడం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన జాతీయ ఎస్సీ కమిషన్ ఓ బృందాన్ని గుంటూరు పంపింది. వైస్ చైర్మన్ అరుణ్ హల్దార్ నేతృత్వంలో గుంటూరు వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు ఏపీ సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.  

ఈ భేటీ సందర్భంగా అరుణ్ హల్దార్ స్పందిస్తూ, ఏపీ ప్రభుత్వాన్ని అభినందించారు. రమ్య హత్యోదంతంలో వేగంగా స్పందించి నిందితుడ్ని అరెస్ట్ చేయడమే కాకుండా, బాధిత కుటుంబానికి వెంటనే నష్టపరిహారం అందించారంటూ సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం జగన్ ను కలిసినవారిలో ఎస్సీ కమిషన్ సభ్యులు డాక్టర్ అంజూ బాల, సుభాష్ రామ్ నాథ్ కూడా ఉన్నారు. ఈ భేటీలో రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా పాల్గొన్నారు. ఇవాళ గుంటూరులో పర్యటించిన కమిషన్ సభ్యులు రమ్య హత్య ఘటనలో వివరాలు సేకరించారు.


More Telugu News