అమెజాన్ యాప్‌లో టెక్నికల్ సమస్య.. యాపిల్ ఫోన్ యూజర్లకు మాత్రమే!
- కొత్తగా ఆర్డర్లు పెట్టలేక కొందరు తిప్పలు
- ఇప్పటి వరకూ పెట్టిన ఆర్డర్ల హిస్టరీ కనబడక కొందరు ఇబ్బందులు
- ట్విట్టర్ వేదికగా అమెజాన్‌కు ఫిర్యాదులు
- అధికారికంగా స్పందించని ఈ-కామర్స్ దిగ్గజం
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో టెక్నికల్ సమస్య వచ్చింది. యాపిల్ ఫోన్లు ఉపయోగించే వారికే ఈ సమస్య తలెత్తింది. ఆండ్రాయిడ్ యాప్‌లో ఎటువంటి సమస్యా రాలేదు. ఇదే సమయంలో ఐఓఎస్ యాప్ వాడే వారు మాత్రం టెక్నికల్ సమస్య ఎదుర్కొన్నారు. కొందరు తాము ఇచ్చిన ఆర్డర్ల హిస్టరీ చెక్ చేసుకోలేకపోతే, మరి కొందరు కొత్తగా ఆర్డర్లు ఇవ్వలేకపోయారు. ‘‘Sorry something went wrong. We're working on fixing it. (CS11)’’(ఏదో సమస్య వచ్చినందుకు చింతిస్తున్నాం. దీన్ని సరిచేయడానికి పని చేస్తున్నాం) అని మెసేజ్ వచ్చింది.
దీనిపై పలువురు వినియోగదారులు అమెజాన్‌ను సంప్రదించారు. ట్విట్టర్ వేదికగా ఫిర్యాదులు చేశారు. ‘‘ఉదయం నుంచి ఇదే సమస్య ఉంది. యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేసి మళ్లీ ఇన్‌స్టాల్ చేశాను. అయినా ప్రాబ్లం పోలేదు’’ అని కొందరు ఫిర్యాదు చేశారు.
దీనిపై అమెజాన్ ప్రతినిధులు స్పందిస్తూ.. ఈ సమస్య వచ్చినందుకు వినియోగదారులకు సారీ చెప్పారు. ఇది తెలిసిన సమస్యేనని, తమ బృందం దీనిపై పనిచేస్తోందని వివరించారు. అయితే ఇలా ట్విట్టర్‌లో సమాధానం చెప్పడమేకానీ, ఈ సాంకేతిక సమస్యపై అమెజాన్ నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటనా వెలువడలేదు.