కరోనా వ్యాక్సిన్ మూడో డోసూ వేయాలంటున్న పరిశోధకులు
- రెండో డోసు తీసుకున్న వారిలోనూ సోకుతున్న వైరస్
- ముఖ్యంగా డెల్టా వైరస్ సోకుతోందన్న పరిశోధకులు
- మూడో డోసు వేసుకుంటే కొత్త వేరియంట్లకు చెక్
కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న వారిలోనూ వైరస్ సోకుతోన్న ఘటనలు బయట పడుతోన్న విషయం తెలిసిందే. అంతేగాక, వ్యాక్సిన్ ను ఎదుర్కొనే కొత్త కరోనా వైరస్ కూడా పుట్టుకురావచ్చన్న వాదనలు వినపడుతున్నాయి.
ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారిలో డెల్టా వేరియంట్ కనపడుతోంది. మానవ రోగ నిరోధక శక్తిని ఎదుర్కొంటూ కలవరపెడుతోంది. రెండు డోసుల టీకా తీసుకున్న వారిలోనూ ఈ వేరియంట్ వైరల్ లోడు అధికంగా ఉంటోంది. దీంతో వారి నుంచి ఇతరులకు వ్యాపించే అవకాశాలు అధికంగానే ఉంటున్నాయి. మరోవైపు రెండు డోసుల టీకా తీసుకున్న వారిలో కొంత కాలానికి యాంటీబాడీలు తగ్గిపోతున్నాయి.
దీంతో బూస్టర్ డోసు తప్పనిసరి అన్న వాదన ప్రస్తుతం వినపడుతోంది. మూడో డోసు వేయించుకుంటే శరీరంలో యాంటీబాడీలు తిరిగి గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు, యాంటీబాడీలు శరీరంలో దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో డెల్టా వంటి వేరియంట్లను సమర్థంగా ఎదుర్కోవచ్చని చెబుతున్నారు. ఇప్పటికే పలు దేశాలు మూడో డోసు వేయడానికి సిద్ధమయ్యాయి.