జాతీయ బీసీ కమిషన్ ను కలవనీయకుండా అడ్డుకుంటున్నారు: పోలీసులపై సాధినేని యామిని మండిపాటు
- రమ్య ఇంటి వద్దకు వెళ్లిన జాతీయ ఎస్సీ కమిషన్
- తమను పోలీసులు కలవనీయలేదని యామిని మండిపాటు
- వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై అరాచకాలు పెరిగాయని వ్యాఖ్య
ఇటీవల దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హత్య ఘటన విచారణ నిమిత్తం రమ్య ఇంటి వద్దకు జాతీయ ఎస్సీ కమిషన్ వెళ్లింది. ఈ సందర్భంగా కమిషన్ సభ్యుల వాహనాల వెనుక వైసీపీ నేతల వాహనాలను మాత్రమే పంపించారంటూ బీజేపీ నేతలు మండిపడ్డారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకురాలు సాధినేని యామిని మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం, పోలీసులపై మండిపడ్డారు.
జై జగన్ అన్న వెంటనే వైసీపీ శ్రేణులను పోలీసులు పంపిస్తున్నారని యామిని మండిపడ్డారు. కమిషన్ సభ్యులను కలవకుండా తమ పార్టీ నేతలను మాత్రం అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు పెరిగిపోయాయని అన్నారు. ముఖ్యంగా దళిత మహిళలు, అమ్మాయిలపై దాడులు ఎక్కువయ్యాయని విమర్శించారు.
మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని... అన్యాయం జరిగిన తర్వాత పరిహారం ఇస్తున్నామని చెపుతూ చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. నిర్భయ చట్టాన్ని అమలు పరచడం లేదని మండిపడ్డారు. మోసపూరితమైన హామీలను ఇస్తూ ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తోందని అన్నారు.