చీర‌క‌ట్టులో పోజులు ఇస్తూ, మెరిసిపోతూ పీవీ సింధు ఫొటోలు.. వైర‌ల్

  • ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు పోస్ట్ చేసిన సింధు
  • నెటిజ‌న్లను అమితంగా అక‌ర్షిస్తోన్న బ్యాడ్మింట‌న్ స్టార్
  • తెలుపు రంగు చీర‌లో క‌న‌ప‌డ్డ సింధు
  • ఆ చీర‌ను డిజైన్ చేసిన మ‌నీశ్ మ‌ల్హోత్రా
భార‌త్‌కు వ‌రుస‌గా రెండోసారి ఒలింపిక్స్ మెడ‌ల్ తీసుకొచ్చిన బ్యాడ్మింట‌న్ స్టార్, హైద‌రాబాదీ పీవీ సింధు గత కొన్ని రోజులుగా ప‌లు కార్య‌క్రమాల్లో పాల్గొంటూ ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షిస్తోంది. త‌న బ్రాండ్ విలువ‌ను మ‌రింత పెంచుకుంటోంది. తాజాగా ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫొటోలు అల‌రిస్తున్నాయి.

                       
బ్యాడ్మింట‌న్‌ జెర్సీలోనే కాకుండా సంప్ర‌దాయ దుస్తుల్లోనూ అంద‌రి మ‌న‌సులూ దోచుకోగ‌ల‌న‌ని ఆమె నిరూపిస్తోంది. తెలుపురంగు చీర‌, దానిపై పూల డిజైన్‌తో ఉన్న చీర క‌ట్టుకుని ఆమె ఫొటోల‌కు పోజులు ఇచ్చింది. ప్రముఖ కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌ మ‌నీశ్ మ‌ల్హోత్రా ఈ చీర‌ను డిజైన్ చేశారు.

           
పింక్, బ్లూ, పర్పుల్ థ్రెడ్‌వర్క్ తో ఈ చీర‌ను మ‌నీశ్ డిజైన్ చేశారు. భార‌తీయ సంప్ర‌దాయ దుస్తుల్లోనూ క‌న‌ప‌డుతూ అంద‌రి దృష్టినీ త‌న వైపున‌కు తిప్పుకోగ‌ల‌న‌ని సింధూ నిరూపించుకుంటోంది ప్ర‌స్తుతం పీవీ సింధు ఒలింపిక్స్‌లో త‌న విజ‌యాన్ని ఎంజాయ్ చేస్తూ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించ‌డానికి కంపెనీల దృష్టిని ఆక‌ర్షించే ప‌నిలో ఉంది.  


      


More Telugu News