తమ ఇంటికి రావద్దంటూ షర్మిలకు షాకిచ్చిన నిరుద్యోగి తండ్రి 

  • రేపు మంచిర్యాల జిల్లా లింగాపూర్ లో షర్మిల దీక్ష
  • ఆత్మహత్య చేసుకున్న నరేశ్ ఇంటికి వెళ్లాల్సి ఉన్న షర్మిల
  • నరేశ్ తండ్రి వ్యాఖ్యలతో పునరాలోచనలో వైయస్సార్టీపీ
వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు ఊహించని షాక్ తగిలింది. షర్మిల ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహారదీక్షలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రేపు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ లో దీక్ష చేపట్టాల్సి ఉంది. అయితే దీక్ష కోసం తమ ఇంటికి రావద్దంటూ షర్మిలను మరణించిన నిరుద్యోగి నరేశ్ తండ్రి కోరారు. ఆయన వ్యాఖ్యలతో వైయస్సార్టీపీ నేతలు పునరాలోచనలో పడ్డారు.

నరేశ్ విషయానికి వస్తే ఆయన డిగ్రీ వరకు చదువుకున్నాడు. నరేశ్ ముగ్గురు అన్నలకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. తనకు ఉద్యోగం రాకపోవడంతో తండ్రితో పాటు వ్యవసాయం చేస్తున్నాడు. అయితే ప్రభుత్వ ఉద్యోగం రాలేదనే బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.


More Telugu News