'సలార్'లో రాజమన్నార్ గా జగపతిబాబు.. లుక్ ఇదిగో!
- ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ 'సలార్'
- కథానాయికగా నటిస్తున్న శ్రుతిహాసన్
- జగపతిబాబు లుక్ తో పోస్టర్ విడుదల
ఒకప్పుడు హీరోగా పలు సినిమాలు చేసి, ఫ్యామిలీ హీరో ఇమేజ్ తెచ్చుకున్న ప్రముఖ నటుడు జగపతిబాబు తన సెకండ్ ఇన్నింగ్స్ లో పూర్తి భిన్నమైన పాత్రలను పోషిస్తున్న విషయం మనకు తెలిసిందే. పలు సినిమాలలో కరుడు గట్టిన విలన్ పాత్రలు ధరిస్తూ.. ఆయా పాత్రల పోషణలో తనదైన ముద్ర వేస్తున్నారు. అయితే, వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఒప్పేసుకోకుండా సత్తా వున్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటున్నారు.
ఈ క్రమంలో ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రంలో కూడా ఆయన విలన్ పాత్రను పోషిస్తున్నారు.
'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 'సలార్' పేరిట ఓ భారీ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తోంది.
ఇక ఈ చిత్రంలో జగపతిబాబు విలన్ గా నటిస్తున్నారు. ఆయన పాత్ర పేరు రాజమన్నార్! ఇందుకు సంబంధించిన లుక్ ను ఈ రోజు చిత్ర బృందం విడుదల చేస్తూ.. కీలక అప్ డేట్ ను ఇచ్చింది. ముక్కుకు రింగుతో.. రౌద్రంతో జగపతి ఈ లుక్ లో కొత్తగా కనిపిస్తున్నారు. ఈ లుక్కును బట్టే ఇది చాలా పవర్ ఫుల్ పాత్ర అన్న విషయం మనకు అర్థమవుతుంది. భారీ యాక్షన్ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది.