అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలకు చంద్రబాబే కారకుడు: ఉండవల్లి శ్రీదేవి

  • అగ్రిగోల్డ్ వ్యవహారంలో వైసీపీ వర్సెస్ టీడీపీ
  • చంద్రబాబుపై ధ్వజమెత్తిన వైసీపీ మహిళా ఎమ్మెల్యే
  • అగ్రిగోల్డ్ ఆస్తులు టీడీపీ నేతలు దోచుకున్నారని ఆరోపణ
  • జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారని వెల్లడి
అగ్రిగోల్డ్ వ్యవహారంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. చంద్రబాబు పాపాలను సీఎం జగన్ ప్రక్షాళన చేస్తున్నారని  వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. 1996లో అగ్రిగోల్డ్ సంస్థకు అనుమతులు దక్కిందీ, ఆ సంస్థ బోర్డు తిప్పేసిందీ టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అని తెలిపారు. అగ్రిగోల్డ్ ఆస్తులను టీడీపీ నేతలే దోచుకున్నారని ఆరోపించారు.

అగ్రిగోల్డ్ అక్రమాలకు ప్రధాన సూత్రధారి చంద్రబాబేనని, మధ్య తరగతి డిపాజిట్ దారులను తీవ్ర వేదనకు గురిచేశారని అన్నారు. 300 మంది బాధితుల ఆత్మహత్యలకు చంద్రబాబు కారకుడయ్యారని విమర్శించారు.

జగన్ తన పాదయాత్రలో అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలను గుర్తించారని, అధికారంలోకి వస్తే తప్పకుండా న్యాయం చేస్తామని నాడు హామీ ఇచ్చారని శ్రీదేవి పేర్కొన్నారు. ఇప్పటికే రూ.10 వేల లోపు డిపాజిట్ దారులకు చెల్లింపులు చేశామని, రేపు (ఆగస్టు 24) రూ.20 వేల లోపు బాధితులకు చెల్లింపులు చేస్తున్నామని వివరించారు.


More Telugu News