కిషన్ రెడ్డి భావోద్వేగభరిత వ్యాఖ్యలపై సీపీఐ నారాయణ విమర్శలు
- కన్నీరు కార్చుతూ ప్రజలను బీజేపీ నేతలు మోసం చేస్తున్నారు
- కిషన్ రెడ్డి అన్నీ అసత్యాలు చెబుతున్నారు
- తాలిబన్లు ఎంత ప్రమాదకరమో పెగాసస్ కూడా అంతే
తాను అంబర్‌పేటకు వస్తే చాలా రోజుల అనంతరం బిడ్డ తల్లి దగ్గరకు వచ్చినట్లు ఉందని పేర్కొంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రెండు రోజుల క్రితం భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే. అంబర్‌పేట తనకు తల్లిలాంటిదని ఆయన చెప్పారు. అయితే, ఆయన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. కన్నీరు కార్చుతూ ప్రజలను బీజేపీ నేతలు మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
జన ఆశీర్వాద యాత్ర అంటూ కిషన్ రెడ్డి అన్నీ అసత్యాలు చెబుతున్నారని నారాయణ విమర్శించారు. పార్లమెంటులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అసత్యాలు చెబుతుంటే, బయట కేంద్రమంత్రులు కూడా అదే తీరులో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తాలిబన్లు ఎంత ప్రమాదకరమో, పెగాసస్ కూడా అంతే ప్రమాదకరమని ఆయన చెప్పారు. పెగాసస్ కు సంబంధించిన విషయాలను చెప్పడానికి మోదీ భయపడుతున్నారని నారాయణ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాల వల్ల రైతులకు ఏమాత్రం ఉపయోగం లేదని అఆయన తెలిపారు.