కాబూల్ విమానాశ్రయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు.. రంగంలోకి దిగిన అమెరికా, జర్మనీ దళాలు
- ఆఫ్ఘన్ భద్రతా సిబ్బందిపై గుర్తు తెలియని వ్యక్తుల కాల్పులు
- ఓ అధికారి మృతి.. మరో ముగ్గురికి గాయాలు
- భద్రతా సిబ్బంది, గుర్తు తెలియని వ్యక్తుల మధ్య కొనసాగుతోన్న కాల్పులు
ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు రెచ్చిపోతుండడంతో ఆ దేశాన్ని వీడి విదేశాలకు వెళ్లిపోవడానికి కాబూల్ విమానాశ్రయానికి పెద్ద ఎత్తున జనాలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ తరుచూ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు కూడా కాల్పులు జరిగాయి.
ఒక్కసారిగా ఆఫ్ఘన్ భద్రతా సిబ్బందిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో ఓ భద్రతా అధికారి మృతి చెందారు. అలాగే, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వెంటనే అమెరికా, జర్మనీ దళాలు రంగంలోకి దిగాయి. ఆఫ్ఘన్ భద్రతా బలగాలు, దుండగులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయని జర్మనీ ఆర్మీ ప్రకటించింది. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.