అమెరికాలో కుండపోత వర్షాలు.. ఆకస్మిక వరదలు

  • టెన్నిసీ రాష్ట్రంలో విలయం సృష్టిస్తున్న వరదలు
  • 22 మంది మృతి, 30 మందికిపైగా గల్లంతు
  • కూలుతున్న ఇళ్లు.. భయంకరంగా పరిస్థితి
ఆకస్మిక వరదలతో అమెరికా విలవిల్లాడుతోంది. దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వానల ధాటికి టెన్నిసీ రాష్ట్రంలో శనివారం సంభవించిన ఆకస్మిక వరదలు విలయం సృష్టించాయి. వరదల్లో చిక్కుకున్న 22 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 30 మందికిపైగా గల్లంతయ్యారు. జనావాసాల్లో ఏడు అడుగుల మేర వరదనీరు పోటెత్తింది.

దీంతో కొందరు చెక్కబల్లల సాయంతో బయటపడగా, మరికొందరు చిక్కుకుపోయారు. వందలాది ఇళ్లు, వాహనాలు నీటమునిగాయి. కొన్ని ఇళ్లు అమాంతం కూలిపోయాయి. పరిస్థితి భయానకంగా ఉందని అధికారులు తెలిపారు. సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ కురవనంత వర్షం శనివారం కురిసింది. ఏకంగా 34.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు.



More Telugu News