ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖకు స్పందన.. ఏపీలో నాసిరకం మద్యాన్ని పరిశీలిస్తామన్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి
- ఏపీలో నాసిరకం మద్యం ఏరులై పారుతోందని లేఖ
- ఆ మద్యం తాగి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆరోపణ
- పరిశీలిస్తామన్న కేంద్ర ఆరోగ్య మంత్రి
ఆంధ్రప్రదేశ్‌లో నాసిరకం మద్యం ఏరులై పారుతోందని, కొన్ని బ్రాండ్లు, డిస్టిలరీలు తయారు చేస్తున్న మద్యం తాగుతున్న ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారంటూ ఈ నెల 6న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు లేఖ రాశారు. మద్యాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అందులో కోరారు. తాజాగా ఈ లేఖకు కేంద్రమంత్రి బదులిచ్చారు. లేఖ అందిందని అందులో పేర్కొన్న అంశాలను పరిశీలించి త్వరలోనే స్పందిస్తామని రఘురామకు మంత్రి బదులిచ్చారు. మద్యం ప్రభావాన్ని పరిశీలించి, త్వరలోనే వివరాలు తెలియజేస్తామని ఎంపీకి మంత్రి మాండవీయ తెలిపారు.