సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- మధ్యప్రదేశ్ దేవాలయంలో త్రిష
- బన్నీతో పరశురామ్ ప్రాజక్టు
- 'మాస్టర్' చేయనన్న సల్మాన్
* ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న 'పొన్నియిన్ సెల్వన్' చిత్రం షూటింగ్ ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని ఓర్చా లొకేషన్ లో జరుగుతోంది. అక్కడి ప్రసిద్ధ రామ్ రాజ దేవాలయంలో హీరోయిన్ త్రిష పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలను తాజాగా చిత్రీకరించారు. ఈ నెలాఖరు వరకు అక్కడి పరిసరాలలో జరిగే ఈ షూటింగులో ఇంకా కార్తీ, ప్రకాశ్ రాజ్ తదితరులు కూడా పాల్గొంటున్నారు.
* ప్రస్తుతం మహేశ్ తో 'సర్కారు వారి పాట' చిత్రాన్ని చేస్తున్న దర్శకుడు పరశురామ్.. అల్లు అర్జున్ హీరోగా మరో భారీ చిత్రాన్ని రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నాడట. అయితే, 'సర్కారు వారిపాట' తర్వాత ముందుగా నాగ చైతన్యతో ఓ సినిమా చేసిన అనంతరం బన్నీ ప్రాజక్టును చేబడతాడని తెలుస్తోంది.
* విజయ్ హీరోగా వచ్చిన 'మాస్టర్' తమిళ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నట్టు, సల్మాన్ ఖాన్ హీరోగా నటించనున్నట్టు వార్తలొచ్చిన సంగతి విదితమే. అయితే, సల్మాన్ ఈ ప్రాజక్టును తిరస్కరించినట్టు తాజా సమాచారం. సో.. దీనిని మరో హీరోతో రీమేక్ చేస్తారా? లేక రీమేక్ ఆలోచనను విరమించుకుంటారా? అన్నది తెలియాల్సివుంది.