వివేకానందరెడ్డి హత్యకేసు.. మరో ముగ్గురి విచారణ

వివేకానందరెడ్డి హత్యకేసు.. మరో ముగ్గురి విచారణ
  • కొనసాగుతున్న సీబీఐ విచారణ
  • మునిసిపల్ సిబ్బంది, ప్రైవేటు పాఠశాల ఉద్యోగిని విచారించిన అధికారులు
  • హత్య సమాచారాన్ని ఇస్తే రూ. 5 లక్షలు ఇస్తామని ఇటీవల పత్రికా ప్రకటన
ఏపీ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారించిన సీబీఐ.. నిన్న పులివెందులకు చెందిన మునిసిపల్ సిబ్బంది గంగులయ్య, సురేశ్, కడపలోని ఓ ప్రైవేటు పాఠశాల ఉద్యోగి జగదీశ్వరయ్యను కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో విచారించినట్టు సమాచారం.

కాగా, సీబీఐ రెండు రోజల క్రితం ఓ పత్రికా ప్రకటన ఇస్తూ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన పక్కా సమాచారాన్ని అందించిన వారికి 5 లక్షల రూపాయల నజరానా ఇస్తామని ప్రకటించడం సంచలనమైంది.



More Telugu News