నకిలీ బిట్ కాయిన్ యాప్ లను ప్లేస్టోర్ నుంచి తొలగించిన గూగుల్
- ప్లేస్టోర్ లో నకిలీ బిట్ కాయిన్ యాప్ లు
- గుర్తించిన ట్రెండ్ మైక్రో
- గూగుల్ కు నివేదిక
- వెంటనే స్పందించి చర్యలు తీసుకున్న గూగుల్
బిట్ కాయిన్ యాప్ లకు కూడా నకిలీల బెడద తప్పడంలేదు. తాజాగా 8 నకిలీ బిట్ కాయిన్ యాప్ లను గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించింది. ఇప్పటికే ఈ నకిలీ యాప్ లను తమ ఫోన్లలో ఇన్ స్టాల్ చేసుకుని ఉంటే, తక్షణమే వాటిని తొలగించాలని గూగుల్ స్పష్టం చేసింది.
గూగుల్ తొలగించిన బిట్ కాయిన్ యాప్ లు ఇవే...
ఈ యాప్ ల గుట్టును సైబర్ భద్రత సంస్థ ట్రెండ్ మైక్రో బయటపెట్టింది. ఈ ఎనిమిది యాప్ ల కార్యకలాపాలపై నివేదిక రూపొందించిన ట్రెండ్ మైక్రో... గూగుల్ ను అప్రమత్తం చేసింది. వెంటనే సదరు యాప్ ల తీరుతెన్నులను పరిశీలించిన గూగుల్ వాటిని ప్లేస్టోర్ నుంచి తొలగించింది. ఈ యాప్ లు తప్పుడు ప్రకటనలతో యూజర్లను మోసం చేస్తున్నట్టు ట్రెండ్ మైక్రో వెల్లడించింది.
గూగుల్ తొలగించిన బిట్ కాయిన్ యాప్ లు ఇవే...
- బిట్ కాయిన్ 2021
- ఎథేరమ్- పూల్ మైనింగ్ క్లౌడ్
- బిట్ ఫండ్స్- క్రిప్టో క్లౌడ్ మైనింగ్
- బిట్ కాయిన్ మైనర్- క్లౌడ్ మైనింగ్
- క్రిప్టోహాలిక్- బిట్ కాయిన్ క్లౌడ్ మైనింగ్
- మైన్ బిట్ ప్రొ- క్రిప్టో క్లౌడ్ మైనింగ్ అండ్ బీటీసీ మైనర్
- డైలీ బిట్ కాయిన్ రివార్డ్స్- క్లౌడ్ బేస్డ్ మైనింగ్ సిస్టమ్
- బిట్ కాయిన్- పూల్ మైనింగ్ క్లౌడ్ వాలెట్