కొత్త ఐటీ పోర్టల్ లో చీటికిమాటికి సాంకేతిక సమస్యలు... ఇన్ఫోసిస్ పై కేంద్రం అసంతృప్తి
- జూన్ 7న కొత్త ఐటీ పోర్టల్ ప్రారంభం
- అడుగడుగునా సాంకేతిక సమస్యలంటూ ఫిర్యాదులు
- తీవ్రంగా స్పందించిన కేంద్రం
- ఇన్ఫోసిస్ సీఈఓకు సమన్లు
ఆదాయ పన్ను ఈ-ఫైలింగ్ కార్యకలాపాలు ఎంతో సులువుగా ఉండాలన్న ఉద్దేశంతో కేంద్రం కొత్త ఐటీ పోర్టల్ తీసుకువచ్చింది. ఈ పోర్టల్ ను సాంకేతికంగా అభివృద్ధి చేసే బాధ్యతను కేంద్రం ప్రముఖ టెక్ సంస్థ ఇన్ఫోసిస్ కు అప్పగించింది. అందుకు గాను ఇన్ఫోసిస్ కు రూ.164.5 కోట్లు చెల్లించింది. ఇంతచేసినా కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ లో తరచుగా సాంకేతిక సమస్యలు వస్తుండడంతో కేంద్రం ఇన్ఫోసిస్ పై తీవ్ర అసంతృప్తి చేసింది. ఆగస్టు 21 నుంచి సైట్ నిలిచిపోవడంతో కేంద్రం మరింత మండిపాటుకు గురైంది.
కొత్త పోర్టల్ తీసుకువచ్చిన రెండున్నర నెలలకే సాంకేతిక సమస్యలు ఎందుకు వచ్చాయో వివరణ ఇవ్వాలంటూ ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ కు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ సమన్లు పంపింది. జూన్ 7న ఈ పోర్టల్ ను కేంద్రం ప్రారంభించగా, అప్పటి నుంచి సాంకేతిక సమస్యలపై కేంద్రానికి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి.