దిశా చట్టం పేరుతో ఎన్నాళ్లు మోసం చేస్తారు?... చర్చకు సిద్ధమా?: గౌతు శిరీష

  • ఏపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన గౌతు శిరీష
  • మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శలు
  • జగన్ పాలనలో దాడులు పెరిగాయని ఆరోపణ
  • బాధిత కుటుంబాలకు ఏం న్యాయం జరిగిందన్న శిరీష
టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష్ ఏపీ సర్కారుపై ధ్వజమెత్తారు. దిశ చట్టం పేరుతో ఎన్నాళ్లు మోసం చేస్తారంటూ మండిపడ్డారు. దిశ చట్టంపై బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. 60 ఏళ్ల వృద్ధుల నుంచి ఆరేళ్ల పసిపాపల వరకు ఈ సర్కారులో ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని శిరీష విమర్శించారు. రాష్ట్రంలో రాఖీ శుభాకాంక్షలు తెలిపే పరిస్థితులు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఆడబిడ్డలంటే సీఎంకు ఎందుకంత అలుసో అర్థంకావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మృగాళ్ల బారినపడిన మహిళల కుటుంబాలతో మాట్లాడేందుకు సీఎం జగన్ కు తీరికలేదా? అని నిలదీశారు. రమ్యశ్రీ కుటుంబ సభ్యులను ప్రలోభపెడితే న్యాయం జరగదు అని శిరీష వ్యాఖ్యానించారు. జగన్ రెండేళ్ల పాలనలో మహిళలపై దాడులు పెరిగాయని ఆమె విమర్శించారు. ఇప్పటివరకు బాధిత కుటుంబాలకు ఏం న్యాయం జరిగిందో చెప్పాలని నిలదీశారు.


More Telugu News