ఆఫ్ఘన్‌లోని కాబూల్ విమానాశ్రయంలో తాలిబన్ల కాల్పులు.. తొక్కిసలాటలో ఏడుగురి మృతి.. వీడియో ఇదిగో
- ప్రకటించిన బ్రిటన్ రక్షణ శాఖ
- ఎయిర్‌పోర్టు వద్ద తాలిబన్ల కాల్పులు
- ఆందోనళతో జనం పరుగులు
ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు రెచ్చిపోతుండడంతో ఆ దేశం నుంచి వెళ్లిపోవడానికి పౌరులు పెద్ద ఎత్తున కాబూల్ విమానాశ్రయానికి చేరుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విమానాల్లో ఎక్కడానికి వారంతా ఎగబడుతున్నారు. ఈ క్రమంలో ఈ రోజు అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుని ఏడుగురు మృతి చెందినట్లు బ్రిటన్ రక్షణశాఖ ప్రకటించింది.
కాబూల్ విమానాశ్రయంలో తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరపడం వల్లే జనాలు పరుగులు తీయడంతో తొక్కిసలాట చోటుచేసుకుందని బ్రిటన్ తెలిపింది. కాగా, ఆఫ్ఘనిస్థాన్ శరణార్థులకు ఆశ్రయమిస్తామని అమెరికా సహా పలు దేశాలు ఇప్పటికే ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాలకు వెళ్లేందుకు ప్రజలు వేలాది మంది కాబూల్ ఎయిర్‌పోర్టుకు వస్తున్నారు.