ఆఫ్ఘ‌న్‌లో బాలిక‌లను కాపాడేందుకు బ‌డిలో వారికి సంబంధించిన ప‌త్రాల‌ను త‌గుల‌బెట్టిన సిబ్బంది!

  • అమ్మాయిల చ‌దువులపై తాలిబ‌న్ల ఆంక్ష‌లు
  • బ‌డిలోకి చొర‌బ‌డి అమ్మాయిల వివ‌రాలు తీసుకోకుండా స్కూల్ సిబ్బంది చ‌ర్య‌లు
  • ట్విట్ట‌ర్‌లో వివ‌రించిన స్కూల్ ఆఫ్ లీడర్‌షిప్ ఆఫ్ఘనిస్థాన్ నిర్వాహ‌కుడు
ఆఫ్ఘనిస్థాన్ మొత్తం తాలిబ‌న్ల చేతుల్లోకి వెళ్లిపోవ‌డంతో ఆ దేశంలో ఆ ఉగ్ర‌వాదులు బాలిక‌లు చ‌దువుకోకుండా అడ్డుప‌డే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే మ‌హిళ‌లు, బాలిక‌ల‌పై ప‌లు ఆంక్ష‌లు విధించారు. ఆ దేశంలో ఉండే ఏకైక బాలికల పాఠశాల స్కూల్ ఆఫ్ లీడర్‌షిప్ ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబ‌న్లు చొర‌బ‌డి విద్యార్థినుల చిరునామా వంటి వివ‌రాలు తీసుకోకుండా ఆ బ‌డి నిర్వాహ‌కులు అమ్మాయిల వివ‌రాలు ఉండే ప‌త్రాల‌ను త‌గుల‌బెట్టారు.

ఆ పాఠశాల వ్యవస్థాపకుడు షబనా బాసిజ్ రాషిఖ్ ఆధ్వ‌ర్యంలో సిబ్బంది విద్యార్థినులకు సంబంధించిన ప‌త్రాల‌ను త‌గులబెట్టారు. ఈ విష‌యాన్ని  షబనా బాసిజ్ రాషిఖ్ త‌న‌ ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపారు. తాలిబ‌న్ల నుంచి విద్యార్థినుల కుటుంబాలను కాపాడేందుకే ఈ ప‌ని చేశామ‌ని చెప్పారు.


More Telugu News