నిర్బంధించిన భారతీయులను విడిచిపెట్టిన తాలిబన్లు!
- విమానాశ్రయానికి వెళ్తున్న పలువురి అడ్డగింత
- పత్రాలు పరిశీలించి, ప్రశ్నించి వదిలిపెట్టిన వైనం
- భారత్‌కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు
కాబూల్ విమానాశ్రయానికి వెళ్తున్న పలువురు భారతీయులను నిన్న అడ్డుకుని నిర్బంధించిన తాలిబన్లు అనంతరం విడిచిపెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానాశ్రయంలో పడిగాపులు పడుతున్న వీరిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీరందరూ సురక్షితంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. తొలుత వారిని అడ్డుకున్న తాలిబన్లు పత్రాలు పరిశీలించి, ప్రశ్నించిన తరవాత విడిచిపెట్టారు.
స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న వారిని తాలిబన్లు నిర్బంధించారని, వీరిలో భారతీయులే అత్యధికులని స్థానిక మీడియా ప్రకటించడంతో అప్రమత్తమైన భారత విదేశాంగ శాఖ.. తాలిబన్ల నుంచి వారికి ఎలాంటి హానీ లేదని తెలిపింది. ప్రసుతం కాబూల్ విమానాశ్రయంలో ఉన్న వీరిని స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.