కోఎడ్యుకేషన్ కుదరదు... ఫత్వా జారీ చేసిన తాలిబన్లు
- ఇటీవల ఆఫ్ఘన్ ను ఆక్రమించిన తాలిబన్లు
- తొలుత శాంతి ప్రవచనాలు పలికిన వైనం
- కొన్నిరోజులకే నిజస్వరూపం బట్టబయలు
- హెరాత్ ప్రావిన్స్ లో కోఎడ్యుకేషన్ పై నిషేధం
ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల నిజస్వరూపం క్రమంగా బహిర్గతమవుతోంది. ఇటీవల రాజధాని కాబూల్ ను ఆక్రమించిన సందర్భంలో శాంతిమంత్రం జపించిన తాలిబన్లు, కొన్నిరోజుల వ్యవధిలోనే ఫత్వా జారీ చేయడం భవిష్యత్ ను కళ్లకు కడుతోంది. హెరాత్ ప్రావిన్స్ లోని విద్యాసంస్థల్లో కోఎడ్యుకేషన్ కుదరదని ఆ ఫత్వాలో స్పష్టం చేశారు. సమాజంలో చెడుకు బీజం పడేది కోఎడ్యుకేషన్ ద్వారానే అని తాలిబన్ నేతలు అభిప్రాయపడ్డారు.
ఆఫ్ఘన్ లోని హెరాత్ ప్రావిన్స్ లోని యూనివర్సిటీల ప్రొఫెసర్లతో తాలిబన్లు సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం ఈ ఫత్వా జారీ చేశారు. ఇకపై విద్యార్థినులకు కేవలం మహిళా ప్రొఫెసర్లే బోధించాల్సి ఉంటుంది.
ఆఫ్ఘన్ లోని హెరాత్ ప్రావిన్స్ లోని యూనివర్సిటీల ప్రొఫెసర్లతో తాలిబన్లు సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం ఈ ఫత్వా జారీ చేశారు. ఇకపై విద్యార్థినులకు కేవలం మహిళా ప్రొఫెసర్లే బోధించాల్సి ఉంటుంది.