సీసీ కెమెరాలు ఎత్తుకుపోయే గజదొంగ సుబ్రహ్మణ్యంను అరెస్ట్ చేసిన గుంటూరు పోలీసులు

  • ఎన్ ఫీల్డ్ షోరూం చోరీ కేసును ఛేదించిన పోలీసులు
  • కృష్ణా జిల్లాలో నిందితుడి అరెస్ట్
  • మీడియా ముందుకు తీసుకువచ్చిన ఎస్పీ
  • ఖద్దరు చొక్కా, తెల్ల పంచె ధరించి దొంగతనాలు!
గుంటూరు ఆటోనగర్ ఎన్ ఫీల్డ్ షోరూంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కృష్ణా జిల్లా పెదగొన్నూరులో నిందితుడు గుబిలి సుబ్రహ్మణ్యంను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.4 లక్షలు నగదు, చోరీ చేసిన సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై గుంటూరు అదనపు ఎస్పీ గంగాధరం వివరాలు తెలిపారు.

నిందితుడు సుబ్రహ్మణ్యంపై వివిధ జిల్లాల వ్యాప్తంగా 23 చోరీ కేసులు ఉన్నాయని వెల్లడించారు. ప్రధానంగా సీసీ కెమెరాలు, వైఫై రౌటర్లు, డీవీఆర్ (డిజిటల్ వీడియో రికార్డర్) లు చోరీ చేసేవాడని తెలిపారు. చోరీల్లో సుబ్రహ్మణ్యంది ప్రత్యేకమైన శైలి అని, ఖద్దరు చొక్కా, తెల్ల పంచె ధరించి దొంగతనాలకు వెళ్లేవాడని వివరించారు.

గుంటూరు అర్బన్ పరిధిలోని ఆటోనగర్ రాయల్ ఎన్ ఫీల్డ్ షోరూంలో ఫిబ్రవరి 8న షట్టర్ పగులగొట్టి రూ.2.40 లక్షలు చోరీ చేశాడు. ఈ కేసులో దర్యాప్తు చేసిన పోలీసులు మరిన్ని వివరాలు తెలుసుకున్నారు.


More Telugu News