జిమ్ లో తమిళనాడు సీఎం స్టాలిన్ వర్కౌట్లు... వీడియో ఇదిగో!

  • ఫిట్ నెస్ పై శ్రద్ధ చూపుతున్న స్టాలిన్
  • దినచర్యలో తప్పనిసరిగా వ్యాయామానికి చోటు
  • తాజాగా కసరత్తులు చేస్తూ దర్శనమిచ్చిన స్టాలిన్
  • 68 ఏళ్ల వయసులోనూ హుషారుగా వ్యాయామం
తమిళనాడు సీఎంగా మొట్టమొదటిసారి బాధ్యతలు స్వీకరించిన డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ పాలనలో తనదైన ముద్ర వేసేందుకు శ్రమిస్తున్నారు. పాలనలోనే కాదు, ఆయన ఆరోగ్య పరిరక్షణ కోసం జిమ్ లోనూ శ్రమిస్తున్నారు.

తాజాగా స్టాలిన్ జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. శారీరక దారుఢ్యం కోసం కాస్త కఠినమైన వర్కౌట్లు చేస్తూ స్టాలిన్ దర్శనమిచ్చారు. ఆయన వయసు 68 ఏళ్లు. కానీ ఎంతో కుర్రాడిలా ఆయన ఫిజికల్ ఫిట్నెస్ వ్యాయామాలు చేస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

రాజకీయాలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, స్టాలిన్ దినచర్యలో వ్యాయామం తప్పనిసరిగా ఉంటుంది. యోగా, వాకింగ్, సైక్లింగ్, జిమ్ వర్కౌట్స్... ఇలా ఏదో ఒక రూపంలో శారీరక కసరత్తులు చేస్తారు.


More Telugu News