విశాల్ 'ఎనిమీ' నుంచి ఫస్టు సింగిల్ రిలీజ్!
- విశాల్ హీరోగా 'ఎనిమీ'
- కీలక పాత్రలో ఆర్య
- సంగీత దర్శకుడిగా తమన్
- త్వరలో ప్రేక్షకుల ముందుకు
యాక్షన్ హీరోగా తమిళ .. తెలుగు భాషల్లో విశాల్ కి మంచి క్రేజ్ ఉంది. తమిళంతో పాటు తెలుగులోను ఆయన సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. ఆయన తాజా చిత్రంగా 'ఎనిమీ' రూపొందింది. ఆనంద శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మినీ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించారు.
విశాల్ జోడీగా మృణాళిని రవి నటించిన ఈ సినిమాలో, ప్రతినాయకుడి పాత్రలో ఆర్య కనిపించనున్నాడు. షూటింగు పార్టును పూర్తిచేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తాజాగా ఫస్టు సింగిల్ ను వదిలారు. 'పడదే పడదే పడదే' అంటూ ఈ పాట సాగుతోంది.
తమన్ స్వరపరిచిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా, పృథ్వీచంద్ర ఆలపించాడు. విశాల్ - మృణాళిని రవిపై ఈ పాటను చిత్రీకరించారు. కొంతకాలం పాటు హీరోయిన్ గా తన జోరు చూపించి నటనకు దూరమైన మమతా మోహన్ దాస్, ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషించడం విశేషం.