గంపమల్లయ్య స్వామి క్షేత్రంలో విషాదం.. పూజ చేస్తూ కొండపై నుంచి జారిపడి అర్చకుడి మృతి

  • ఏటా శ్రావణమాసంలో గంపమల్లయ్య క్షేత్రంలో పూజలు
  • కొండరాళ్ల మధ్య కొలువైన దేవుడు
  • రాళ్ల మధ్యకు దిగి పూజలు చేయాల్సిన వైనం
  • ప్రమాదవశాత్తు పడిపోయిన పూజారి పాపయ్య
అనంతపురం జిల్లాలోని గంపమల్లయ్య స్వామి క్షేత్రం ఎంతో సుప్రసిద్ధమైనది. ప్రతి ఏడాది శ్రావణమాసంలో ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. విశేషం ఏంటంటే... ఇక్కడ స్వామివారు అటవీప్రాంతంలో కొండ రాళ్ల మధ్య కొలువై ఉంటాడు. పూజారి ఎలాంటి ఆధారం లేకుండా ఆ కొండ రాళ్ల మధ్యకు దిగి పూజలు చేసి, తిరిగి పైకి రావాల్సి ఉంటుంది. అయితే, ఈ క్షేత్రంలో ఇప్పుడు ఓ విషాద ఘటన చోటుచేసుకుంది.

గంపమల్లయ్య స్వామి వారికి పూజలు చేసే క్రమంలో పూజారి పాపయ్య ప్రమాదవశాత్తు కొండ పైనుంచి పడి మృతి చెందాడు. 40 అడుగుల ఎత్తు నుంచి పడిన ఆయన బండ రాళ్లకు గుద్దుకుంటూ కిందకు పడిపోయాడు. ఈ ఘటనతో గంపమల్లయ్య స్వామి భక్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో మీడియాలో దర్శనమిస్తోంది.


More Telugu News