అమెరికా సహా అన్ని దేశాలతో మాకు సంబంధాలు కావాలి: తాలిబన్​ సహ వ్యవస్థాపకుడు బరాదర్​

  • సంబంధాలక్కర్లేదని మేమెప్పుడూ అనలేదు
  • అవన్నీ వట్టి పుకార్లే.. నిజం కాదు
  • రాజకీయ పార్టీలతో బరాదర్ భేటీ
  • ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న చర్చలు
ప్రపంచంలోని అన్ని దేశాలతో తమకు దౌత్య, వాణిజ్య సంబంధాలు కావాలని, అమెరికాతోనూ సంబంధాలు అవసరమేనని తాలిబన్లు ప్రకటించారు. ఇవాళ తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు ఆయన దీనిపై ట్వీట్ చేశారు. ఏ దేశంతోనూ తాలిబన్లు సంబంధాలు కోరుకోవట్లేదన్న వార్తలను కొట్టిపారేశారు. తామెప్పుడూ అలా మాట్లాడలేదన్నారు. ఇవన్నీ లేనిపోని పుకార్లేనని, వాటిలో వాస్తవం లేదని అన్నారు.

కాగా, దేశంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం బరాదర్ కాబూల్ కు చేరుకున్నారు. రాజకీయ పార్టీల నేతలతో చర్చిస్తున్నారు. అయితే, ఆఫ్ఘనిస్థాన్ ను ఆక్రమించినప్పటి నుంచి తాలిబన్లు ప్రపంచాన్ని నమ్మించే పనిలోనే ఉన్నారు. తాము ఏ ఉగ్రవాద సంస్థతోనూ సంబంధాలు పెట్టుకోబోమని, దేశాభివృద్ధి కోసం ప్రయత్నిస్తామని చెబుతూ వస్తున్నారు. తమను ప్రపంచం గుర్తించాలని కోరుతున్నారు.


More Telugu News