గ‌త పాల‌కులు ఈ ఆల‌యాల అభివృద్ధిని ప‌ట్టించుకోలేదు: కిష‌న్ రెడ్డి

  • తెలుగు ప్ర‌జ‌ల ఆశీర్వాదంతోనే కేంద్ర మంత్రిని అయ్యాను
  • భ‌ద్రాచ‌లం, వేముల వాడ ఆల‌యాల‌ను అభివృద్ధి చేయాలి
  • భువ‌న‌గిరి కోట‌కు ప్ర‌త్యేకత ఉంది  
  • ఆ కోట రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌రిధిలో ఉంది
తెలుగు ప్ర‌జ‌ల ఆశీర్వాదంతోనే తాను కేంద్ర మంత్రిని అయ్యాన‌ని కిష‌న్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో జ‌న ఆశీర్వాద యాత్ర‌లో పాల్గొన్న ఆయ‌న ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ... భ‌ద్రాచ‌లం, వేముల వాడ ఆల‌యాల‌ను అభివృద్ధి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు. గ‌త పాల‌కులు ఈ ఆల‌యాల అభివృద్ధి గురించి ప‌ట్టించుకోలేద‌ని విమర్శించారు. తెలంగాణలో జ‌రుపుకునే బ‌తుక‌మ్మ‌తో పాటు బోనాల పండుగ‌, మేడారం జాతర‌పై దేశ వ్యాప్తంగా ప్ర‌చారం చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

భువ‌న‌గిరి కోట‌కు ప్ర‌త్యేకత ఉంద‌ని, రోప్ వే ద్వారా ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షింప‌జేయాల‌ని ఆయ‌న చెప్పారు. అయితే, ఆ కోట రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌రిధిలో ఉంద‌ని తెలిపారు. త‌న‌కు కేంద్ర మంత్రి ప‌ద‌వి అప్ప‌గించి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ కీల‌క బాధ్య‌త‌ల‌ను త‌న‌పై పెట్టార‌ని చెప్పారు. క‌రోనా విజృంభణ వ‌ల్ల రెండేళ్లుగా ప‌ర్యాట‌క రంగం దెబ్బ‌తింద‌ని ఆయ‌న తెలిపారు. దేశంలో ప‌ర్యాట‌క శాఖ‌ను బ‌లోపేతం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న చెప్పారు.


More Telugu News