విక్రమ్ హీరోగా 'మహాన్' .. ఫస్టు లుక్ రిలీజ్!

  • యాక్షన్ థ్రిల్లర్ గా 'మహాన్'
  • డిఫరెంట్ లుక్ తో విక్రమ్ 
  • ప్రత్యేక పాత్రలో ధృవ్
  • సగానికి పైగా చిత్రీకరణ పూర్తి  
తమిళనాట కమల్ తరువాత కొత్తదనానికి ప్రాధాన్యతనిచ్చే కథానాయకుడిగా విక్రమ్ కనిపిస్తాడు. ప్రయోగాత్మక కథలను .. పాత్రలను ఆయన ఎక్కువగా ఎంచుకుంటూ ఉంటారు. పాత్ర కోసం బరువు పెరగడం .. తగ్గడం చేస్తుంటారు. అంతేకాదు పాత్ర కోసం తెరపై ఎలా కనిపించడానికైనా ఆయన వెనుకాడరు. ఆయన గత చిత్రాలను పరిశీలిస్తే ఈ విషయం మనకి అర్థమవుతుంది.

ఆయన తాజా చిత్రంగా 'మహాన్' రూపొందుతోంది. లలిత్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. విక్రమ్ డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నారు. ఆయన పాత్రను డిఫరెంట్ గా డిజైన్ చేశారనే విషయం అర్థమవుతోంది.

సిమ్రన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, విక్రమ్ తనయుడు ధృవ్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ సినిమా ఇప్పటికే సగానికి పైగా షూటింగును పూర్తి చేసుకుంది. సంతోష్ నారాయణ్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాను, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 


More Telugu News